నితిన్‌ కొత్త సినిమా
తెలుగు కథానాయకుడు నితిన్‌ కొత్త సినిమాకు సంబంధించిన వివరాలను ఎట్టకేలకు వెల్లడించారు. ఈరోజు హోలీ పండుగను పురస్కరించుకుని నితిన్‌ ట్విటర్‌ వేదికగా తన కొత్త సినిమాకు సంబంధించిన ఓ ప్రకటన చేశారు. ‘ముందుగా చెప్పినట్లుగానే నా కొత్త సినిమాలకు సంబంధించిన మొదటి ప్రకటన. అద్భుతమైన టాలెంట్‌ ఉన్న చంద్రశేఖర్‌ యేలేటితో త్వరలో ఓ సినిమా చేయబోతున్నాను. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తారు. చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఏప్రిల్‌ నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అని వెల్లడించారు నితిన్‌. ప్రస్తుతం నితిన్‌.. ‘భీష్మ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో నితిన్‌కు జోడీగా రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలలోనే తన కొత్త సినిమాల గురించి ప్రకటన చేస్తానని, అభిమానులు కాస్త ఓపిక పట్టాలని గతంలో నితిన్‌ కోరిన విషయం తెలిసిందే.  తాజాగా మరో దర్శకుడు రమేష్‌ వర్మతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. హోలీ పండుగ సందర్భంగా చిత్ర బృందం అధికారికంగా ఈ సంగతి ప్రకటించింది.
  


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.