Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
కొత్త కబుర్లు
ప్రకటనలు
Search
ప్రకటనలు
నిలకడగానే రాజశేఖర్ ఆరోగ్యం
సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి వెల్లడించింది. కరోనా కారణంగా రాజశేఖర్ తమ ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్న సిటీ న్యూరోసెంటర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ సపోర్టు లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ రత్నకిశోర్ తెలిపారు.
అరుదైన అవార్డు అందుకున్న ‘ఎఫ్2 ’
2019 సంవత్సరానికి సంబంధించి వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అవార్డులు ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా ఎంపిక చేసి ఇండియన్ పనోరమ పేరిట ప్రతిష్టాత్మకంగా అందించే ఈ అవార్డు ‘ఎఫ్ 2’కి దక్కింది. టాలీవుడ్ నుంచి ఎంపికైన ఏకైక చిత్రమిదే. 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుందీ కుటుంబ కథా చిత్రం. వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి తెరకెక్కించారు. తమన్నా, మెహరీన్ నాయికలు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘ఎఫ్ 3’ రాబోతున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ కోసం.. మేము సైతం
భారీ వర్షాలు భాగ్యనగరాన్ని వణికిస్తున్నాయి. చాలామంది నగరవాసులు తమ నివాసాల్ని కోల్పోయారు. హైదరాబాద్ మహానగరం ఎప్పుడూ లేనంతగా అస్తవ్యస్థంగా మారింది. బాధితుల్ని ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మేము సైతం అంటూ టాలీవుడ్ తారలు, దర్శకులు, నిర్మాతలు ముందుకొచ్చారు. బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు.
జోడీ కుదిరింది
విజయ్ సేతుపతికి జోడీగా రాశిఖన్నా ఎంపికైంది. విజయ్ కథానాయకుడుగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘తుగ్లక్ దర్బార్’. ప్రసాద్ దీన్‌దయాల్ దర్శకత్వం వహిస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోకి రాశిఖన్నాని నాయికగా ఆహ్వానిస్తూ ట్వీట్ చేసింది చిత్రబృందం.
‘రాధేశ్యామ్’కి ప్రభాకరన్ స్వరాలు
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతోన్న ప్రేమకథ ‘రాధేశ్యామ్’. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడి వివరాలు రహస్యంగా ఉంచి ఆసక్తి పెంచింది చిత్రబృందం. తాజాగా ఆ సర్ప్రైజ్ని అందించింది. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. తమిళం, కన్నడ, మలయాళ భాషా చిత్రాలకు పనిచేశారు ప్రభాకరన్. తెలుగు శ్రోతలకు ఈయన సుపరిచితుడే. విజయ్ దేవరకొండ కథానాయకుడుగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’కి సంగీతం అందించారు జస్టిన్. ఇందులోని అన్ని పాటలు విశేషంగా అలరించాయి. ప్రభాస్, ప్రభాకరన్ కాంబినేషన్లో ఎలాంటి సంగీతం రాబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు. జగపతి బాబు, సత్యరాజ్, భాగ్యశ్రీ, జయరాం, మురళీ శర్మ ప్రియదర్శి తదితరులు నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కృష్ణం రాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నాయి. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు.
పోలీసు అవ్వాలనుకున్నా..
శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్రీకారం’ చిత్రంలో నటిస్తున్నారు సాయి కుమార్. తిరుపతి పరిసరాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా సతీసమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో కాసేపు ముచ్చటించారాయన. చిత్రీకరణలో పాల్గొనేందుకు వచ్చినట్లు తెలిపారు. తాను హీరోగా నటించిన ‘పోలీసు’ చిత్రం రేపటితో 24 ఏళ్లు పూర్తి చేసుకుంటోందని, ఆ మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులే అసలైన హీరోలని అన్నారు.
‘మహా సముద్రం’లో భాగమైంది
యువ నాయిక అను ఇమ్మాన్యుయేల్ ‘మహా సముద్రం’ చిత్రంలో భాగస్వామైనట్టు వెల్లడించింది చిత్ర బృందం. శర్వానంద్, సిద్దార్ద్ కథానాయకులుగా అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇప్పటికే నాయికగా అదితిరావు హైదరీ ఎంపిక అవగా తాజాగా మరో నాయికగా అనుని తీసుకున్నామని ప్రకటించింది నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్. దర్శకుడు ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి పాత్రని కీలకంగా మలిచారని తెలిపింది. లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సెట్స్‌పైకి వెళ్లకముందే వారానికో ఆసక్తికర అప్డేట్ ఇస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
‘కోతి కొమ్మచ్చి’ ఆడేందుకు
ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, నరేష్ ‘కోతి కొమ్మచ్చి’ ఆడేందుకు సిద్ధమయ్యారు. మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న కథానాయకులుగా సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై యమ్.ఎల్.వి.సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇద్దరు యువ నాయకులతో చక్కటి వినోదాత్మక చిత్రంగా రూపొందించనున్నారు సతీష్ వేగేశ్న. ఈ యువ హీరోలతో వినోదం పంచేందుకు రాజేంద్ర ప్రసాద్, నరేష్ సిద్ధమయ్యారని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ‘కొన్ని దశాబ్దాలుగా తమ అల్లరితో ప్రేక్షకులను నవ్వించిన నవ్వుల రారాజులు మా కోతులతో కలిసి నవ్వించడానికి సిద్ధం’ అని తెలిపారు దర్శకుడు సతీష్ వేగేశ్న. నాయిక వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
వచ్చేశాడు ‘ఖిలాడి’
మాస్ మహారాజ రవితేజ ‘ఖిలాడి’గా దర్శనమిచ్చేశారు. ఈయన కథానాయకుడుగా రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రమిది. డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి నాయికలు. తాజాగా టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు ‘ఖిలాడి’ అనే పేరు ఖరారు చేశారు. ప్లే స్మార్ట్ అనేది ఉపశీర్షిక. రవితేజ క్లాస్‌లుక్‌లో కనిపించి కిరాక్ పుట్టిస్తున్నాడు. బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తులు ధరించి.. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. నేపథ్యంలో కరెన్సీ కాగితాలు గాల్లో ఎగురుతూ కనిపించి ఆసక్తిని పెంచుతున్నాయి.
మరోసారి కలిశారు
‘వై దిస్ కొలవెరి’ అంటూ సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించారు అనిరుధ్, ధనుష్. ధనుష్ కథానాయకుడుగా తెరకెక్కిన ‘3’ చిత్రంలోని గీతమిది. అనిరుధ్ స్వరాలు సమకూర్చగా ధనుష్ ఆలపించారు. తమిళ్ సినిమా సాంగ్ అయినప్పటికీ ఇంగ్లిష్ లిరిక్స్‌తో అన్ని భాషల వారిని అలరించింది. దాంతో ఈ ఇద్దరి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మళ్లీ క్రేజీ కాంబో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన సంగీత అభిమానులకు శుభవార్త వినిపించారు. ధనుష్ కథానాయకుడుగా ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘డీ 44’ వర్కింగ్ టైటిల్. ‘డీ 44’కి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు అని ప్రకటించింది నిర్మాణ సంస్థం. నేడు అనిరుధ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియో పంచుకుంటూ వివరాలు వెల్లడించింది.
First
Previous
2
3
4
5
6
7
8
9
10
11
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
ప్రారంభమైన ప్రభాస్ సలార్ చిత్రం
‘పీఎస్పీకే 27’.. మళ్లీ మొదలైంది
నిహారిక కొణిదెల వెబ్ సిరీస్ చిత్రం ప్రారంభం
ధనుష్ 43వ చిత్రం ప్రారంభం
మరో ప్రేమకథ మొదలైంది..
హీరోగా జానీ మాస్టర్
కార్యక్రమాలు
మరిన్ని
మళ్లీ కలిశారు..!
గర్జిస్తున్న ‘బెజవాడ సింహం’
‘నటులను స్టార్స్ చేసేది వెండితెరే.. బుల్లి తెర కాదు’
రణ్వీర్, అక్షయ్, అజయ్ సెట్ అవుతారు..
మహేష్ అందానికి కారణం ఏమిటో నాకు తెలుసు: విష్ణు
అబ్బాయి మెరుపుతీగలా’ ఉన్నాడు
అవి ఇవి
మరిన్ని
ముచ్చటగా మూడోసారి?
ప్రమాదం నుంచి బయటపడ్డ సంపూ
‘6 టీన్స్’ హీరో.. యాక్షన్‌తో రీ ఎంట్రీ
సూర్య సరసన ప్రియాంక?
ఆసక్తికర టైటిల్‌తో 23వ సినిమా..
ఏప్రిల్ మాసంలో విడుదల కానున్న రాధేశ్యామ్?
ట్రైలర్...టీజర్
మరిన్ని
పడిలేచిన వాడితో పందెం ప్రమాదం
అదరగొడుతున్న ‘రైడర్’ టీజర్
ట్రైలర్ వచ్చేసింది
‘బంగారు బుల్లోడు’.. నవ్వులు పూయిస్తున్నాడు
అసలేం జరిగింది?
కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు..
ఆన్లైన్లో..
మరిన్ని
‘ఎస్డీటీ 14’ టైటిల్ చెప్పగలరా?
‘ఖిలాడి’ సర్‌ప్రైజ్‌కి బీ రెడీ
పెళ్లి గురించి ఏమందంటే..?
‘శాకుంతలం’ సెట్స్ చూశారా..!
‘ప్రభాస్ 21’.. అప్డేట్ ఎప్పుడంటే
చిరు.. ఆ నలుగురు
ప్రకటనలు
మరిన్ని
ఆ వార్తలు ప్రచారం చేయొద్దు: గుణశేఖర్
రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న సురేశ్ ప్రొడక్షన్స్
కమల్‌కి శస్త్ర చికిత్స..
'ఇది మహాభారతం కాదు'...వర్మ కొత్త వెబ్‌సీరీస్ చిత్రం
‘ఆ ఒక్క చిత్రంలోనే నటిస్తున్నారు’
పవన్ - రానా చిత్రానికి మాటల రచయితగా త్రివిక్రమ్