ప‌వ‌న్ పోటీ చేస్తున్న స్థానాలు ఇవే
తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో సినిమా రంగం ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. సాధార‌ణ ఎన్నిక‌లు వ‌చ్చాయంటే సినీ తార‌లు ఒక‌రిద్ద‌రైనా బ‌రిలోకి దిగి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటారు. కొద్దిమంది తారలు పార్టీల వారీగా విడిపోయి... ప్ర‌చారంతో ఓట‌ర్ల‌ని ప్ర‌భావితం చేస్తుంటారు. ఈసారి క‌థానాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచింది. ఆ పార్టీ అధ్య‌క్షుడైన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తాడ‌నే విష‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది. ఎట్ట‌కేల‌కి ఆ ఉత్కంఠ‌కి తెర‌దించుతూ జ‌న‌సేన పార్టీ వ‌ర్గాలు ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోటీ చేయ‌బోయే స్థానాల్ని ప్ర‌క‌టించాయి. పార్టీ మేథావులు, నాయ‌కుల అభిప్రాయం మేర‌కు భీమ‌వ‌రం, గాజువాక అసెంబ్లీ స్థానాల్లో ప‌వ‌న్‌ని పోటీకి దింపాల‌ని నిర్ణ‌యించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సోద‌రుడు చిరంజీవి కూడా ఆయ‌న స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌ఫున రెండు స్థానాల్లో పోటీ చేసిన విష‌యం తెలిసిందే. చిరు తిరుప‌తి స్థానంలో గెల‌వ‌గా, పాలకొల్లులో ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. మ‌రి ప‌వ‌న్, ఆయ‌న పార్టీ ఈసారి ఎన్నిక‌ల‌పై ఏ స్థాయిలో ప్ర‌భావం చూపుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.