పవన్‌ కల్యాణ్‌ మరో కొత్త చిత్రంపవన్‌ కల్యాణ్‌ సామాజిక - రాజకీయ అంశాలతో పాటు సినిమాల్లో చురుగ్గా ఉంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా నిర్మాణ సంస్థ కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటిస్తూ ఓ ప్రత్యేక వీడియోని అభిమానులతో పంచుకుంది. ‘‘తెలుగు సినిమా అభిమాన పోలీస్‌ ఈజ్‌ బ్యాక్‌‌ ఇన్‌ హై ఓల్టేజ్‌ రోల్‌’’ అని పేర్కొంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. దసరా పండుక్కి కిక్కిచ్చే అప్‌డేట్‌ ఇచ్చాడని పవన్‌ అభిమానులు సంతోషంలో తేలిపోతున్నారు. ప్రస్తుతం పవన్‌ ‘వకీల్‌సాబ్’‌ చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాదు క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలోనూ చేస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.