టైటిల్‌ లుక్‌తోనే ఆసక్తిరేకెత్తిస్తోన్న మణిరత్నం
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’. దక్షిణాది, ఉత్తరాది తారలతో భారీ అంచనాల నడుమ ఈ క్రేజీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా టైటిల్‌ లుక్‌ విడుదల చేశారు. చాలా ఆసక్తికరంగా పోస్టర్‌ను రూపొందించారు. పెద్ద ఖడ్గంపై రెండు వైపులా సింహాల ప్రతిమలు దర్శనమిస్తున్నాయి. ఓ కొండ ప్రాంతంలో పడిన సూర్యరశ్మి ఈ కత్తిపై అంచున పడుతున్నట్లు చూపించారు. ‘బిగినింగ్‌ ఆఫ్‌ ది గోల్డెన్‌ ఎరా’ అంటూ వస్తున్న ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. టైటిల్‌ లుక్‌తోపాటు చిత్రానికి సంబంధించి అన్ని వివరాలు ప్రకటించారు. సుభాస్కరన్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్‌, మద్రాస్‌ టాకీస్‌ పతాకంపై నిర్మితమవుతుందీ చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సాంకేతిక నిపుణుల వివరాలివీ..

కథ: కల్కి
సంగీతం: ఎ.ఆర్‌. రెహమాన్‌
డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ: రవి వర్మన్‌
ఎడిటర్‌: శేఖర్‌ ప్రసాద్
డైలాగ్స్‌: జయ మోహన్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.