అఖిల్‌ కొత్త చిత్రంలో పూజా హెగ్దే ఫిక్స్‌

అఖిల్‌తో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అఖిల్‌ 4వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని గీతా2 పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. సంగీతం గోపీ సుందర్‌. అయితే ఈ సినిమాలో కథానాయిక ఎవరు అనేది ఎప్పటి నుంచో ఉన్న సందేహం. ఎందరో హీరోయిన్ల పేరు వినిపించినప్పటికీ పూజా హెగ్దే అఖిల్‌ సరసన నటిస్తుందంటూ, ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆమె నటించడంలేదని రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. అఖిల్‌ చిత్రంలో నటించేది పూజా హెగ్దే అని చిత్ర బృందం ప్రకటించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.