‘ప్రభాస్‌ 20’ ఫస్ట్‌లుక్‌!

ఎప్పుడెప్పుడా అని ఆసక్తికరంగా చూశారు సినీ అభిమానులు ప్రభాస్‌ అప్‌డేట్‌ కోసం. ఇటీవలే చిత్ర బృందం ‘ప్రభాస్‌ 20’ నుంచి ఓ సర్‌ప్రైజ్‌ రాబోతుందని ప్రకటించడంతో అంచనాలు పెరిగాయి. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్‌ 20వ చిత్రమిది. ‘జాన్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. చెప్పినట్లుగానే తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభాస్‌ లుక్‌ను విడుదల చేశారు. అయితే ఇందులో చీకటిలో నిలబడిన ప్రభాస్‌ ఆరగడుగుల కటౌట్‌ కనిపిస్తుంది కానీ ఆయన ముఖం కనిపించదు. విశాలవంతమైన భవనంలోని ఓ గదిలో తీసిన ఫోటో ఇది. ప్రభాస్‌ నిలబడిన స్థానం ముందు సంగీత పరికరం ఉంటుంది. భవన గోడపై ఫోటో ఫ్రేమ్‌లు అమర్చి ఉంటాయి. ఇదంతా చూస్తుంటే అలనాటి రోజులు గుర్తు చేసేలా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ పోస్టర్‌ను చూసిన నెటిజన్లు నిరాశకు గురై కామెంట్స్‌ పెడుతున్నారు. ‘ఏంటి ఇది. ఇలా చేశావేంటి ప్రభాస్, ఏదో అనుకున్నాం’ అంటూ రాసుకొస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.