ప్రభాస్ అభిమానుల ఆసక్తికి తెర పడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా? అనే సందేహానికి సమాధానం దొరికింది. అంతేకాదు సర్ప్రైజ్ బోనస్‌గా వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్స్మ్ ప్రశాంత్-ప్రభాస్ కలయికలో చిత్రం ప్రకటిస్తూ ప్రభాస్ లుక్, టైటిల్‌ని విడుదల చేసింది. ఈ క్రేజీ కాంబోకి ‘సలార్’ పేరు ఖరారు చేశారు. రఫ్ లుక్‌లో తుపాకి పట్టుకుని ఆసక్తి రేకెత్తిస్తున్నాడు ప్రభాస్. భారీ యాక్షన్ నేపథ్యంలో సాగే కథ అనిపిస్తుంది పోస్టర్ చూస్తుంటే. మోస్ట్ వైలెంట్మేన్గా దర్శనమివ్వనున్నాడు ప్రభాస్ ఈ చిత్రంలో. టైటిల్ పాత్రను పోషించబోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విజయ్ కిరగన్దూర్ నిర్మిస్తున్నారు. నాయిక, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’తో బిజీగా ఉన్న ప్రభాస్ మరోవైపు రెండు చిత్రాలు ప్రకటించాడు. ‘ఆదిపురుష్’తోపాటు నాగఅశ్విన్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యాడు.