ప్రశాంత్‌ వర్మ కరోనా చిత్రం జాంబీ రెడ్డి


ఇప్పుడు ప్రపంచం ముందున్న సమస్య ఒక్కటే అదే కరోనా వైరస్‌ (కోవిడ్‌-19). ఈ మహమ్మారి నేపథ్యంలో తెలుగులో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పేరే జాంబీ రెడ్డి. చిత్రానికి సంబంధించిన టైటిల్‌ని ఈ రోజు ప్రకటించారు. యాపిల్‌ ట్రీ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజ్‌ శేఖర్‌ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్ లుక్‌తో పాటు ప్రోమోను సైతం విడుదల చేశారు. సినిమాకి మార్క్ కె.రాబిన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే నటీనటులతో కూడా ప్రకటించనున్నారట. తెలుగులో తొలిసారిగా 'జాంబీ' జోనర్లో వస్తున్న సినిమా ఇదని చిత్ర నిర్మాణ సంస్థ ఈ సందర్భంగా ప్రకటించింది. ప్రశాంత్‌ వర్మ గతంలో 'అ!', 'కల్కి'లాంటి వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.