‘పెళ్లి సందడి’ మళ్లీ మొదలవుతుంది!

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘పెళ్లి సందడి’ అనే పేరు ఖరారు చేసినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియో పంచుకున్నారు. తనదైన శైలిలో రూపొందించిన ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కె.రాధామోహనరావు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా ఆర్కా మీడియా వర్క్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. చంద్రబోస్‌, శివ శక్తి దత్తా సాహిత్యం అందిస్తున్నారు. నాయకానాయిక, ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. శ్రీకాంత్‌ కథానాయకుడుగా గతంలో రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మంచి విజయం అందుకుందా చిత్రం. మరోసారి అదే టైటిల్‌నే ఎంపిక చేసుకోవడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. అయితే ఈ కొత్త టైటిల్‌లో డి అనే అక్షరాన్ని ఆంగ్లంలో పెట్టడానికి కారణమేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.