‘రాజ్‌దూత్‌’ వచ్చేస్తున్నాడు!

యాక్షన్‌ స్టార్‌ దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాజ్‌దూత్‌’. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రం జులై 5వ తేదీన తెరపైకి రానుందని చిత్ర బృందం ప్రకటించింది. అర్జున్‌ గున్నాల - కార్తిక్‌లు దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. కథానాయికగా తెలుగమ్మాయి నక్షత్ర నటిస్తుంది. చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్, టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి. సంగీతం: వరుణ్‌ నిర్మాత: ఎమ్‌ఎల్‌వి సత్యనారాయణ.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.