అందుకే రాజకీయాల్లోకి.. కానీ, ముఖ్యమంత్రిగా!!

‘‘వ్యవస్థను సరిచేయకుండా మార్పు రావాలని కోరుకోవడం సరికాదని అంటు’’న్నారు ప్రముఖ నటుడు రజనీకాంత్‌. చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో ఆయన నేడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దేశ, రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావించారు. 'గతవారం నేను రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో సమావేశమయ్యా. నేను ఓ విషయంలో అసంతృప్తిగా ఉన్నానని ఆ సమావేశంలో చెప్పా. ఆ తర్వాత దానిపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇవ్వడానికే వచ్చా. 1996కి ముందు ఏనాడూ రాజకీయాల గురించి ఆలోచించలేదు. దీని గురించి ప్రజలు నన్ను ఎప్పుడు అడిగినా దేవుడి దయ అని చెప్పాను. రాజకీయాల్లోకి వస్తానని రెండేళ్ల క్రితం మొదటిసారిగా చెప్పా. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాలను బాగా విశ్లేషించా. 2016-17లో రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత లోపించింది. మంచివాళ్లు రాజకీయాల్లోకి రావట్లేదు. వ్యవస్థను సరిచేయకుండా మార్పు రావాలని కోరుకోవడం సరికాదు' అని రజనీ చెప్పుకొచ్చారు. తనకు సీఎం పదవిపై ఏనాడూ వ్యామోహం లేదని రజనీ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. 45 సంవత్సరాలుగా తాను సినిమాలో సాధించిన పేరు రాజకీయాల్లో ప్రభావితం చేస్తుందని అన్నారు. తన పార్టీలో 60 నుంచి 65శాతం యువకులకే అవకాశం ఇస్తానని చెప్పారు.


ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..

'గతవారం నేను రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో సమావేశమయ్యా. ఓ విషయంలో అసంతృప్తిగా ఉన్నానని ఆ సమావేశంలో చెప్పా. ఆ తర్వాత దానిపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇవ్వడానికే వచ్చా. 1996కు ముందు ఏనాడూ రాజకీయాల గురించి ఆలోచించలేదు. దీని గురించి ప్రజలు నన్ను ఎప్పుడు అడిగినా దేవుడి దయ అని చెప్పాను. రాజకీయాల్లోకి వస్తానని రెండేళ్ల క్రితం మొదటిసారిగా చెప్పా. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాలను బాగా విశ్లేషించా. డీఎంకే, అన్నాడీఎంకే వంటి గొప్ప పార్టీలతో ఢీకొనడం మామూలు విషయం కాదు. అయితే జయలలిత, కరుణానిధి వంటి రాజకీయ ఉద్ధండుల మృతి తర్వాత రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత లోపించింది. ఇలాంటి తరుణంలో వ్యవస్థలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే నేను రాజకీయాల్లోకి వస్తున్నా. వ్యవస్థను సరిచేయకుండా మార్పు రావాలని కోరుకోవడం సరికాదు' అని రజనీ చెప్పుకొచ్చారు

సీఎం పదవిపై వ్యామోహం లేదు..

45 సంవత్సరాలుగా తాను సినిమా రంగంలో సాధించిన పేరు రాజకీయాల్లో ప్రభావితం చేస్తుందని రజనీ ఈ సందర్భంగా అన్నారు. అయితే తనకు సీఎం పదవిపై ఏనాడూ వ్యామోహం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తాను పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని చెప్పారు. 'నా వయసు ఇప్పుడు 68 సంవత్సరాలు.. నాకు ఇప్పుడు సీఎం పదవి అవసరమా?. నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను. సీఎం అభ్యర్థిని తయారుచేస్తాను అని ప్రజలకు స్పష్టం చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం' అని వివరించారు.

యువతకు ప్రాధాన్యం..

అధ్యక్షుడిగా ఉంటూ పార్టీపైనే దృష్టి సారిస్తానని చెప్పారు. పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ప్రజల మనసులో ప్రేమ, నిజాయతీ ఉన్నవాళ్లకే సీఎం స్థానం దక్కుతుందని తెలిపారు. రాజకీయాల్లో విద్యా ప్రమాణాలు, వయస్సు కూడా ముఖ్యమేనని రజనీ అన్నారు. అందుకే తాను స్థాపించబోయే పార్టీలో 60 నుంచి 65శాతం యువకులకే అవకాశం ఇస్తానని చెప్పారు. యువతతో పాటు విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు కూడా ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ప్రజలకు అన్నలా ఉండే నాయకులను తయారుచేయడమే తన లక్ష్యమని రజనీ వివరించారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.