అభిమానులకు చెర్రీ విన్నపం!

కరోనా వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకు వివరించి మీ వంతు సామాజిక బాధ్యత నెరవేరిస్తే అదే నాకు ఈ సంవత్సరం మీరు ఇచ్చే అతిపెద్ద పుట్టిన రోజు కానుక’’ అని అభిమానులకు పిలుపునిచ్చాడు యువ కథానాయకుడు రామ్‌ చరణ్‌. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ హడలెత్తిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వాలు దీనిపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని తన పుట్టిన రోజు వేడుకల్ని విరమించుకోవాల్సిందిగా అభిమానుల్ని కోరాడు చెర్రీ. మార్చి 27 చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని సామాజిక మాధ్యమాల వేదికగా ఓ లేఖను విడుదల చేశాడు. ‘‘మీకు నా మీద ఉన్న ప్రేమ, నా పుట్టిన రోజుని పండగా జరపడానికి మీరు పడుతున్న శ్రమ నేను అర్థం చేసుకోగలను. మనం ఉన్న ఈ అసాధారణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం నా పుట్టిన రోజు వేడుక విరమించుకోవాల్సిందిగా నా మనవి’’ అని పేర్కొన్నాడు. ఇటీవలే కరోనా జాగ్రత్తలపై ఎన్టీఆర్‌తో కలిసి ఓ వీడియో రూపొందించి అవగాహన కల్పించాడు. చెర్రీ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.