నటించాలనే ఆసక్తి మీలో ఉందా?

నటించాలనే తపన..నటులుగా రాణించాలనే ఆసక్తి మీలో ఉందా?. అయితే మీకోసమే ఈ ఆహ్వానం. సురేష్‌ ప్రొడక్షన్‌ సంస్థ త్వరలో ఓ సినిమాను రూపొందిస్తోంది. ఇందులో నటించేందుకు కొత్త నటీ,నటులకు ఆహ్వానం పలుకుతోంది. వయస్సు 18 నుంచి 55 సంవత్సరాలలో ఉండాలని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగే కాస్టింగ్‌ కాల్‌కు హాజరవ్వాలి. మే 23 నుంచి 27 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎంపికలు జరుగుతాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.