దంగల్‌ దర్శకుడితో గీతా ఆర్ట్స్‌ ‘రామాయణ’

తె
లుగు చిత్రసీమలో మంచి అభిరుచి గల అగ్ర నిర్మాతల్లో అల్లు అరవింద్‌ ఒకరు. ప్రస్తుతం ఆయన తన గీతా ఆర్ట్స్‌ సంస్థలో ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. భారతీయ ఇతిహాసాలలో ఎంతో గొప్పదైన రామాయణ మహా కావ్యాన్ని వెండితెరపై చూపించబోతున్నట్లు ప్రకటించారు. ‘రామాయణ’ పేరుతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించబోయే ఈ భారీ చిత్రాన్ని.. మొత్తం మూడు భాగాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనికి అరవింద్‌తో పాటు నమిత్‌ మల్హోత్రా, మధు మంతెన తదితరులు నిర్మాణ భాగస్వామ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును ‘దంగల్‌’ దర్శకుడు నితీష్‌ తివారి, ‘మామ్‌’ దర్శకుడు రవి ఉద్యావర్‌ సంయుక్తంగా తెరకెక్కించనున్నారు. పూర్తి 3డి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను రూపొందించనున్నారు. తొలి భాగాన్ని 2021లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇందులో కనిపించబోయే నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బంది వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.