ఆ పాత్రకు ఏఎన్నార్‌ కావాలట

తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన చిత్రాలకు చిరునామాగా నిలిచారు రవిబాబు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆవిరి’ ఈ శుక్రవారం ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు రవిబాబు తీయబోయే తరువాత చిత్రం గురించి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. తన తదుపరి చిత్రం ఆమెరికా నేపథ్యంలో సాగుతుందని, ఒక వయసు మళ్ళిన వ్యక్తికి కథలో కీలక పాత్ర ఉందట. ఆ పాత్రకు ఏఏన్నార్‌ లాంటి మనిషి కావాలి. అటువంటి వ్యక్తి కోసం వెతుకులాట కూడా ప్రారంభించాడట ఈ విభిన్న చిత్రాల దర్శకుడు. ఈ సినిమా అంతా అమెరికాలో చిత్రీకరణ సాగిస్తారట. ఆ వయసు మళ్శిన వ్యక్తి దొరకగానే చిత్రీకరణ ప్రారంభిస్తారట. మరి రవిబాబుకి ఏఎన్నార్‌ ఎప్పడు దొరుకుతాడో, చిత్రీకరణ ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.