మరోసారి రవితేజతో శ్రుతిహాసన్‌

గోపీచంద్‌ మలినేని రవితేజ కథానాయకుడుగా ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. రవితేజకు ఇది 66వ చిత్రం కావడంతో ‘ఆర్‌టి 66’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపుదిద్దుకుంటుంది. తాజాగా ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రుతిహాసన్‌ నటిస్తుందని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. గతంలో శ్రుతి రవితేజతో ‘బలుపు’ సినిమాలో నటించి అలరించింది. ఇప్పుడు అదే తరహాలో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు గోపీచంద్‌ దర్శకత్వంలో రవితేజ ‘డాన్‌శీను’, ‘బలుపు’ చిత్రాల్లో నటించారు. ఈ రెండు మంచి విజయం అందుకోవడంతో ఈ కాంబినేషన్‌కు క్రేజ్‌ ఏర్పడింది. ఇప్పుడు మరోసారి రాబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. టైటిల్, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.