‘రెడ్‌’ సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది

రా
మ్‌ కథానాయకుడుగా కిషోర్‌ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం ‘రెడ్‌’. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ నాయికలు. ఈ నెల 28న సినీ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ సిద్ధచేసింది చిత్ర బృందం. అదేంటంటే? ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్‌. ఫిబ్రవరి 28 సాయంత్రం గం.5లకు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. స్రవంతి రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరగా షూటింగ్‌ పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రెడ్‌’ అనే పేరుతోనే అందరిలో ఆసక్తి పెంచిన చిత్ర బృందం టీజర్‌తో ఎలాంటి అంచనాలు పెంచుతుందో చూడాలి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.