‘సర్కారు వారి పాట’ గురించి ఏమన్నారంటే..

‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేష్‌ బాబుకి వదినగా రేణు దేశాయ్‌ నటిస్తుందంటూ ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఇటీవలే సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయంపై స్పందించారామె. ‘ఆ సినిమాలో నటించట్లేదు. అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో తెలియట్లేదు. అవాస్తవాన్ని నమ్మొద్దు. ఏ సినిమాలోనైనా నటించే అవకాశం ఉంటే స్వయంగా నేనే ప్రకటిస్తా’ అని తెలిపారు.ప్రస్తుతం ‘ఆద్య’ అనే పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు రేణు. ఎం.ఆర్‌.కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రైతుల సమస్యలపై ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.