‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సర్‌ప్రైజ్‌ రేపే!

ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ను మరికొన్ని గంటల్లో అధికారికంగా ప్రకటించనున్నారు దర్శకనిర్మాతలు. సామాజిక మాధ్యమాల వేదికగా మార్చి 25న టైటిల్‌ లోగో, మోషన్‌ పోస్టర్‌ విడుదల చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు రాజమౌళి. ‘ప్రస్తుతం కరోనా వైరస్‌ దృష్ట్యా బృంద సభ్యులందరం ఇంటి నుంచే పనిచేస్తున్నాం. అభిమానులు, ప్రేక్షకుల్ని నేను కోరేది ఒక్కటే. ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆన్‌లైన్లో మాత్రమే పోస్టర్‌ను ఎంజాయ్‌ చేయండి. ప్రింట్లు, ఫ్లెక్స్‌లు పెట్టొద్ద’’ని ట్వీట్‌లో పేర్కొన్నారు. సినిమా ప్రారంభించనపుడే అభిమానుల నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం వివిధ భాషల్లో పేర్లు సేకరించారు. వీటిలో పేరు ఖరారు చేశారా, వేరేనా అనేది తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ నాయకులుగా తెరకెక్కుతోంది ఈ క్రేజీ ప్రాజెక్టు. అలియా భట్‌, ఒలివియా మోరిస్‌ నాయికలు. డీవీవీ ఎంటర్‌టైన్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.