తారక్‌ కథానాయిక ఈమెనే..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎవరు నటిస్తారనే ప్రశ్నకు తెరపడింది. రామ్‌ చరణ్, తారక్‌తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌లో నటించే కథానాయికలపైన ఆసక్తి ఉండేది సినీ ప్రియుల్లో. ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ డైసీ ఎడ్గర్‌ను తీసుకున్నా.. పలు కారణాల వల్ల ఆమె ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి ఎవరు ఈ అవకాశం తీసుకుంటారా అని ఎదురు చూశారు అభిమానులు. తాజాగా ఎన్టీఆర్‌ పక్కన కనిపించనున్న నటిని ప్రకటించారు. హాలీవుడ్‌ నటి ఒలివియా మారీస్‌ జెన్నీఫర్‌ అనే పాత్రలో తారక్‌ సరసన నటించబోతుంది. కథానాయిక మాత్రమే కాదు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్న మరో ఇద్దరి నటులను ప్రకటించారు. రే స్టీవెన్‌సన్‌, అలిసన్‌ డూడీ నెగిటివ్‌ రోల్‌లో కనిపించబోతున్నారు. రే స్టీవెన్‌ సన్‌ స్కాట్‌గా, అలిసన్‌ లేడీ స్కాట్‌గా దర్శనమివ్వబోతున్నారు.
:


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.