‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలో స్పందించిన సుదీప్‌!
ర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో తాను నటించడం లేదని కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ స్పష్టం చేశారు. టాలీవుడ్‌ అగ్రకథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మొదటిసారి కలిసి నటిస్తుండటంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంపై సినీ ప్రియుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాలో సుదీప్‌ ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి సోషల్‌మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీసు అధికారి పాత్రలో సుదీప్‌ నటించనున్నారంటూ, జనవరి 20 నుంచి ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నటుడు సుదీప్‌ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. తాను ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించడం లేదంటూ స్పష్టం చేశారు. ''ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నేను నటిస్తున్నానంటూ గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమైనవి. ఇప్పటివరకూ నన్ను 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రబృందం సంప్రదించలేదు. మాట్లడలేదు.' అని సుదీప్ ట్వీట్‌ చేశారు.


'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటించనున్నారు. రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ నటిస్తుండగా ఎన్టీఆర్‌కు జంటగా ఒలివియా మోరిస్‌ కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలకపాత్రను పోషించనున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.