హైదారాబాద్‌ దాదాలపై...

ఆయన తీసే చిత్రాలు వివాదాస్పదం కావు. వివాదం ఉండే చిత్రాలనే తీస్తాడు రామ్‌ గోపాల్‌ వర్మ. మాఫీయ డాన్‌లు, రాజకీయ నాయకులు, ఆసక్తిర యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు రూపొందిస్తుంటారు ఆయన. ఇప్పుడు మరో సారి అలాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని ప్రకటించాడు వర్మ. ‘‘ఇప్పుడే ‘జార్జిరెడ్డి’ సందీప్‌ ‘దాదాస్‌ ఆఫ్‌ హైదారాబాద్‌’ చిత్రానికి సంతకం చేశారు. విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు పూర్తయ్యారు. హైదరాబాద్‌లో 80 దశకంలోని దాదాలపై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ పాత్రకు నా ‘శివ’నే స్ఫూర్తి’’ అని చెప్పాడు వర్మ. సందీప్‌ ఇంతకు ముందు వర్మ దర్శకత్వం వహించిన ‘వంగవీటి’లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సందీప్‌ నటించిన ‘జార్జిరెడ్డి’ ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.