ఆకట్టుకుంటున్న ‘సీతాయణం’ లుక్‌

ప్రముఖ కన్నడ కథానాయకుడు శశి కుమార్‌ తనయుడు అక్షిత్‌ ‘సీతాయణం’ చిత్రంతో వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. అనహిత భూషణ్‌ నాయిక. ప్రభాకర్‌ ఆరిపాక తెరకెక్కిస్తున్నాడు. లలితరాజ్యలక్ష్మి నిర్మాత. రోహన్‌ భరద్వాజ్‌ సమర్పకులుగా వ్యవహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇందులో నాయకానాయికలు వివాహ వస్త్రాల్లో దర్శనమిచ్చారు. ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారు. చేతినిండా గాజులు, మెడలో పూల దండ, జడలో పూలు పెట్టుకుని నాయిక అనహిత వధువుగా ఒదిగిపోయింది. ‘సీతాయణం’ టైటిల్‌ లోగో ఆసక్తికరంగా మలిచారు. రామాయణం మాత్రమే అందరికి తెలుసు. మరి ‘సీతాయణం’ అంటే? తెరపై చూడాల్సిందే. వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.