అందుకే ‘సాహో’ నుంచి తప్పుకున్నారట

ప్ర
భాస్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సాహో’. యువ దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్ర సంగీత బాధ్యతల నుంచి శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ త్రయం తప్పుకుంటున్నట్లు ప్రకటించి చిత్ర బృందానికి షాక్‌ ఇచ్చింది. అయితే ఇలా అర్ధంతరంగా ఈ చిత్రాన్ని వదిలిపెట్టడానికి కారణమేంటన్నది తాజాగా శంకర్‌ మహదేవన్‌ మీడియాకు వెల్లడించారు. ‘‘‘సాహో’లో బయటి కంపోజర్ల నుంచి మరిన్ని పాటలు జత చేయించాలని చిత్ర బృందం ఆలోచనగా ఉంది. ఈ విషయం మాకు కాస్త అసౌకర్యాన్ని కలిగించింది. అందుకే సంగీత బాధ్యతల నుంచి తప్పుకున్నాం. ఇటీవల కాలంలో ఓ చిత్రానికి అనేకమంది సంగీత దర్శకులు కలిసి పనిచేయడం చూస్తూనే ఉన్నాం. ఇదే విషయం గురించి నిర్మాణ సంస్థ మాతో చర్చించింది. కానీ, మాకు అలా చేయడం ఇష్టం లేదని చెప్పాం. ఎందుకంటే ఓ సినిమాకు ఒక సంగీత దర్శకుడే సంగీతం అందిస్తారు. ఫలానా చిత్రానికి సంగీతం అందించింది ఆయే అని చెప్పగలిగినప్పుడే మనకు గౌరవం దక్కుతుంది. వాస్తవానికి ‘సాహో’కు సంగీతంతో పాటు నేపథ్య సంగీతం కూడా మేమే అందించాలనుకున్నాం. కానీ, నిర్మాన సంస్థ దానికి వేరొకరిని నియమించుకుంది. కనీసం పాటల వరకైనా మమ్మల్ని మాత్రమే తీసుకోవచ్చు కదా? నేను, ఎహసాన్, లాయ్‌ కలిసి ఎన్నో చిత్రాలకు స్వరాలు సమకూర్చాం. మేం మల్టిపుల్‌ కంపోజర్స్‌ అనే ఐడియాను వ్యతిరేకించడం లేదు. కానీ, అంతమందితో కలిసి పని చేయాలంటే సౌకర్యం ఉండదు’’ అని శంకర్‌ వెల్లడించారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.