‘మహాసముద్రం’లో అడుగుపెట్టాడు



చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు సిద్ధార్ద్‌. అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్న ‘మహాసముద్రం’లో అవకాశం దక్కించుకున్నాడు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకి సిద్ధార్ద్‌ని ఎంపిక చేసినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది చిత్ర బృందం. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత అజయ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అందరి భారీ అంచనాలు నెలకొన్నాయి. శర్వానంద్, సిద్ధార్ద్‌ కాంబినేషన్‌ అనగానే సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. సినిమాకు సంబంధించిన మరిన్ని సర్‌ప్రైజ్‌లు త్వరలోనే ప్రకటిస్తామన్నారు నిర్మాత. ప్రస్తుతం శర్వానంద్‌ ‘శ్రీకారం’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘గృహం’ డబ్బింగ్‌ చిత్రంతో సందడి చేశాడు సిద్ధు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.