నాగశౌర్య సరసన షిర్లీ సెటియా!

అందమైన ప్రేమకథా నేపథ్యంలో నాగశౌర్య ఓ సినిమా చేస్తున్నారు. అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయికగా షిర్లీ సెటియా నటించనుంది. ఎంతోమందిని సినిమా కోసం సంప్రదించగా ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో నటించిన ఆక్లాండ్‌కు చెందిన షిర్లీ సెటియా ఈ అవకాశం దక్కింది. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇటీవలే చిత్రం ప్రారంభమైంది. డిసెంబర్‌ నుంచి సినిమా చిత్రీకరణ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమౌతోంది. కుటంబ కథానేపథ్యంలో వస్తున్న సినిమాని ఇరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. మహతి స్వరా సాగర్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: రాము, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌. షిర్లీ సెటియా బాలీవుడ్‌లో మస్కా, నికమ్మ అనే చిత్రాల్లో నటించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.