‘సాహో’ టీజర్‌కు ముహూర్తం కుదిరింది
ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో డార్లింగ్‌కు జోడీగా శ్రద్ధాకపూర్‌ నటిస్తోండగా.. జాకీ ష్రాఫ్, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ‘సాహో’ టీజర్‌ను ఈ నెల 13న రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో పాటు చిత్ర విడుదల తేదీని మరోసారి ప్రకటిస్తూ.. శ్రద్ధా కపూర్‌కు సంబంధించిన పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.