సందడి థియేటర్లలోనే..

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్ర విడుదలకు ముహూర్తం కుదిరింది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు చిత్రబృందం శుభవార్త వినిపించింది. ఈ చిత్రం ఓటీటీలో వస్తుందా? థియేటర్‌లో వస్తుందా? అనే సందేహం వీడింది. డిసెంబర్‌లో థియేటర్లలోనే సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనుంది. సాయి తేజ్‌, నభా నటేష్‌ జంటగా తెరకెక్కిన చిత్రమిది. సుబ్బు దర్శకుడు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్‌లో రాబోతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ వేసవికే విడుదల కావాల్సి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. అన్‌లాక్‌లో భాగంగా పునఃప్రారంభమై వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు నుంచి యు సర్టిఫికేట్‌ అందుకుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.