చెన్నైలోనే శ్రీదేవి మొదటి వర్థంతి కార్యక్రమం
జాతీయ నటి శ్రీదేవి చనిపోయి ఫిబ్రవరి 24, 2019 నాటికి సంవత్సరం పూర్తి అవుతుంది. బోనీకపూర్‌ తన సతీమణి శ్రీదేవి స్వస్థలం చెన్నైలోనే సంవత్సరీకాన్ని చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ కార్యక్రమంలో బోనీకపూర్‌ కుటుంబ సభ్యులతో పాటు అనిల్‌ కపూర్, ఆయన భార్య సునీతా కపూర్‌ పాల్గొంటారు. ఈ మధ్య ఓ సమావేశంలో శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ మాట్లాడుతూ..‘‘మా అమ్మ చనిపోయిందన్న వార్త నేను ఇంకా మర్చిపోలేదు. ఆమె జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడాతూనే ఉన్నాయని’’ అంటోంది. గత సంవత్సరం 2018లో శ్రీదేవి దుబాయ్‌లో బంధువుల పెళ్లికి వెళ్లి ఓ హోటల్‌ స్నానాల గదిలోనే మృతిచెందిన విషయం తెలిసిందే.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.