తమన్నా - సత్యేదేవ్‌ల చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’

విభిన్నమైన చిత్రాల్లో వైవిధ్యంగా త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కులను మెప్పిస్తున్న కథానాయకుడు స‌త్య‌దేవ్. నాగశేఖర్‌ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో త‌మన్నా కథానాయికగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’ అనే పేరును ఖరారు చేశారు. నాగ‌శేఖ‌ర్ మూవీస్ పతాకంపై భావ‌న ర‌వి నిర్మిస్తున్నారు. చిత్రాన్ని త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రారంభించటానికి అన్ని ఏర్పాట్లు జ‌రుగుతుండగానే సినిమాకి సంబంధించిన ఆడియోని 75 ల‌క్ష‌లకి క‌న్న‌డ నెం1 ఆడియో కంపెని ఆనంద్ ఆడియో వారు సొంతం చేసు్కొంది. అలాగే గుర్తుందా శీతాకాలం చిత్రంతో ఆనంద్ ఆడియో తెలుగు మార్కట్‌లోకి పర‌చ‌యం అవుతున్నారు. కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగశేఖర్‌ మాట్లాడుతూ.. స‌త్య‌దేవ్‌, త‌మ‌న్నాకాంబినేషన్‌ అన‌గానే తెలుగు చిత్రమార్కెట్ చాలా క్రేజ్‌ వచ్చింది. చాలా మంది నాకు కంగ్రాట్స్ చెబుతూ ఎన్నో కాల్స్ వచ్చాయి. ఇంకా చిత్రం ప్రారంభం కాలేదు. అయినా కన్నడ ఆడియో కంపెని వారు మ్యూజిక్ ని ఫ్యాన్సి రేట్ కి 75 ల‌క్ష‌ల‌కి కొనుగొలు చేయ‌టం ఈ చిత్రం యెక్క మెద‌టి రికార్డ్ అనే చెప్పాలి. సత్య - తమన్నాల క్రేజి కాంబినేష‌కి ఎలాంటి పేరు పెట్టాలి అనుకుంటున్న స‌మ‌యంలో ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ ఖ‌రారు చేశాం. త్వరలోనే చిత్రాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.