స్వల్ప మార్పులు... ఐదు పాటలు

హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ తెలుగులో ‘వకీల్‌సాబ్‌’గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్‌. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రని పవన్‌ కల్యాణ్‌ పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచే అంచనాలు అంబరాన్నంటాయి. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు ‘పింక్‌’లో చాలా మార్పులు చేస్తున్నారని గతంలో ప్రచారం సాగింది. ఇదే విషయంపై స్పష్టత ఇచ్చారు దర్శకుడు వేణు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ‘వకీల్‌సాబ్‌’కి గురించి ముచ్చటించారు. మూలకథను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కిస్తున్నామని, కేవలం కొన్ని సన్నివేశాలు మాత్రమే మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయన్నారు. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ‘వకీల్‌ సాబ్‌’ అక్టోబరు, నవంబరులో పుఃనప్రారంభం కానుంది. దిల్‌రాజు, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.