`విక్ర‌మ్ వేద` కాదు... వెంకీ నుంచి మ‌రోటి త్వ‌ర‌లో!
వెంక‌టేష్ ప్ర‌స్తుతం త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్యతో క‌లిసి `వెంకీ మామ‌` చేస్తున్నారు. ఆ త‌ర్వాత సినిమా ఏంట‌న్న‌ది ఇంకా ఖరారు చేయ‌లేదు. కానీ ఇటీవ‌ల ఓ కొత్త క‌బురు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. `విక్ర‌మ్ వేద` రీమేక్‌లో వెంకీ న‌టించ‌బోతున్నార‌న్న‌ది ఆ ప్ర‌చారం. నారా రోహిత్ మ‌రో క‌థానాయ‌కుడిగా న‌టిస్తార‌ని చెప్పుకున్నారు. కానీ అందులో నిజం లేద‌ట‌. ఆ విష‌యాన్ని వెంకీ సోద‌రుడు, నిర్మాత డి.సురేష్‌బాబు ప్ర‌క‌టించారు. వెంక‌టేష్ `విక్ర‌మ్ వేద‌` చేయ‌డం లేద‌ని, త్వ‌ర‌లోనే ఓ కొత్త సినిమాని మొద‌లు పెట్ట‌బోతున్నాడ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రి ఆ కొత్త సినిమా ఎవ‌రితో అన్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. త్రినాథ‌రావు న‌క్కిన‌, వీరు పోట్ల‌, పూరి జ‌గ‌న్నాథ్‌తోపాటు ప‌లువురు ద‌ర్శ‌కుల వెంకీ కోసం క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు. మ‌రి వెంకీతో త‌దుప‌రి సినిమా ప‌ట్టాలెక్కించే ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.