‘మాస్టర్‌’ ఆగమనం అప్పుడే..

‘బిగిల్‌’తో ఈ ఏడాది అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నారు తమిళ స్టార్‌ హీరో విజయ్‌ దళపతి. ఈ ఉత్సాహంలోనే ఆయన ‘మాస్టర్‌’ అనే చిత్రాన్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ‘ఖైదీ’ చిత్రంతో ఇటు సినీప్రియులు, అటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల గురించి ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. 2020 ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఏ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తాడో మాత్రం చెప్పకుండా ఆసక్తి పెంచారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెంచుతుంది. త్వరలోనే కథానాయిక వివరాలు తెలియనున్నాయి. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతుండగా.. యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ స్వరాలు సమకూర్చబోతున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.