వరుస హిట్లతో టాలీవుడ్లో దూసుకెళ్తున్నారు సంగీత దర్శకుడు తమన్. కోలీవుడ్‌లోనూ అదే జోరు చూపించారు. ప్రముఖ తమిళ నటుడు విజయ్‌తో ఎప్పటి నుంచో కలిసి పనిచేయాలన్న తమన్ కోరిక త్వరలోనే తీరనుంది. ఇళయ దళపతి విజయ్ తదుపరి చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘దళపతి 65’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ఎ.ఆర్.మురగదాస్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం లోకేశ్ దర్శకత్వలో ‘మాస్టర్’ చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ‘దళపతి 65’ ప్రారంభంకానుంది.ఇటీవలే తమన్ సారథ్యంలో వచ్చిన ‘బుట్ట బొమ్మ’, ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు ప్రపంచ సంగీత ప్రియుల్ని ఓలలాడించాయి. భాషా బేధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పాటల్ని ఆస్వాదించారు. ‘క్రాక్’, ‘వకీల్ సాబ్’ చిత్రాలకు సంగీతం అందించే పనుల్లో ఉన్నాడు తమన్.