సాయంత్రానికో లవర్‌తో ‘ఫేమస్‌ లవర్‌’

అతనో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ప్రతి సాయంత్రం ఒక లవర్‌ని పరిచయం చేస్తానంటున్నాడు. ఇతని ప్రేమ కథలో మొత్తం నలుగురు నాయికలున్నారు. రేపటి నుంచి ప్రతి సాయంత్రం ఒక్కోక్కరిని పరిచయం చేస్తానంటున్నాడు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ఇందులో మొత్తం నలుగురు నాయికలున్నారు. వారి ఫస్ట్‌లుక్‌లని రేపటి నుంచి విడదుల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు దర్శకనిర్మాతలు. రేపు ఐశ్వర్య రాజేష్‌ లుక్‌ విడుదలకానుంది. ఇదే క్రమంలో లైటి, కేథరిన్‌ థెరిస్సా, రాశీ ఖన్నాల లుక్‌లను విడుద లచేయనున్నారు. క్రాంతి మాధవ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేమికుల రోజు కానుకగా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది వరకు విడుదల చేసిన విజయ్‌ దేవరకొండ ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.