యువ రచయితలకు వెన్నుదన్నుగా..

‘ఆనందో బ్రహ్మా’, ‘యాత్ర’ వంటి హిట్లతో దర్శకుడిగా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మహి వి రాఘవ్‌. ఇప్పుడీయన నిర్మాతగానూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తన మిత్రులు శివమేక, రాకేష్‌ మహంకాళిలతో కలిసి ‘త్రీ ఆటమన్‌ లీవ్స్‌’ పేరిట ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించారు. అయితే ఈ సంస్థ సంప్రదాయ తెలుగు నిర్మాణ సంస్థల తరహాలో కాకుండా వైవిధ్యమైన ఆలోచనలతో ముందుకు సాగబోతుందట. సినిమా కథలు రాయగలిగే సత్తా ఉన్న ఔత్సాహిక రచయితల్ని ప్రోత్సహిస్తూ.. వారి చేత కొత్త కథల్ని తయారు చేయించడం తమ సంస్థ ఉద్దేశమని రాఘవ్‌ వెల్లడించారు. ఇలా పుట్టుకొచ్చే కథలను పలు నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మించేందుకు కూడా తమ సంస్థ ముందుంటుందని ఆయన తెలిపారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.