కీర్తి 30 క‌థ‌ల్ని కాద‌నుకుంద‌ట‌
`మహానటి` త‌ర్వాత తెలుగులో న‌టించ‌లేదు కీర్తిసురేష్‌. `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు`లో మ‌రోసారి సావిత్రి పాత్ర‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా ఆమె నో చెప్పింది. `మ‌హాన‌టి`తో వ‌చ్చిన గుర్తింపు అలా ఉండాల‌నే ఆమె ఆ నిర్ణ‌యం తీసుకొంది. అందులో మేజిక్ మ‌ళ్లీ రిపీట్ అవుతుందో లేదో, అలాంట‌ప్పుడు మ‌ళ్లీ ఆ పాత్ర చేయ‌డం ఎందుకనే ఉద్దేశంతోనే అలాంటి నిర్ణ‌యం తీసుకొన్నాన‌ని స్ప‌ష్టం చేసింది. అయితే `మ‌హాన‌టి` త‌ర్వాత తెలుగు నుంచి ఆమెకి అవ‌కాశాలు వెల్లువెత్తాయ‌ట‌. దాదాపు 30 క‌థ‌ల్ని వినుంటాన‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేసింది కీర్తి. అన్ని క‌థ‌లు విన్నాక కూడా ఆమెకి సంతృప్తి ల‌భించ‌లేద‌ట‌. చేసిన పాత్ర‌ల్లాగే అనిపించాయట‌. అందుకే ఆమె ఏ సినిమాకీ గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. ఇటీవ‌లే ఓ లేడీ ఓరియెంటెడ్ క‌థ చేయ‌డానికి ఒప్పుకుంది. న‌రేంద్ర అనే ఓ కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. మ‌హేష్ కోనేరు నిర్మిస్తున్నారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.