మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్‌?
యంగ్‌ హీరో వరుణ్‌ తను నటించిన ‘వాల్మీకి’ చిత్రం విడుదలకు ముందే తదుపరి ప్రాజెక్టులకు సన్నాహాలు చేస్తున్నాడు. వాల్మీకి సినిమాకు సంబంధించిన ప్రొమోషన్లలో పాల్గొంటూనే మరోవైపు కథలు వింటున్నాడని వినికిడి. ఈ నేపథ్యంలో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన ఓ ఆకస్తికర స్టోరీ వరుణ్‌కు బాగా నచ్చిందట. దీంతో ఆయన ఓకే చెప్పాడనేది టాలీవుడ్‌ టాక్‌. అంతేకాదు ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. దర్శకుడు గాంధీ, యూవీ క్రియేషన్స్‌ కలయికలో వచ్చిన చిత్రం ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ మంచి విజయం అందుకుంది. మరోసారి అదే కాంబినేషన్‌ రిపీట్‌ చేస్తుండటంతో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానుంది. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.