‘18 పేజీస్‌’లో.. 18వ రోజు

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజీస్‌’. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం పునఃప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌లో తాజాగా కథానాయిక అనుపమ పాల్గొంది. ‘18 పేజీస్‌ సెట్‌లో 18వ రోజు అడుగుపెట్టా. ఇంతకు మునుపెన్నడు లేని ఆసక్తి కలుగుతుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. అక్కడి బృందంతో చేసిన అల్లరిని వీడియోలో బంధించి పోస్ట్‌ చేసింది. ఈ కొత్త ప్రేమ కథలో ఏ పాత్ర చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సంగీతం: గోపీసుందర్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.