ఎనిమిది నిమిషాల కోసం 70 కోట్ల ఖర్చు


రె
బల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సాహో’. సుజీత్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో శ్రద్ధాకపూర్‌ కథానాయిక. ఈ సినిమాలో ఓ పోరాట సన్నివేశం కోసం ఏకంగా డెభ్బై కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్‌ నటిస్తున్నందున సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్‌ సన్నివేశం కోసం అంతర్జాతీయంగా పేరొందిన స్టంట్‌మాస్టర్‌ పెంగ్‌ జాంగ్‌ ఆధ్వర్యంలో సుమారు వందమంది వీదేశి ఫైట్‌మాస్టర్లతో ప్రభాస్‌ పోరాడే సన్నివేశం చిత్రీకరించారట. ఇందుకోసం ఏకంగా పది ఎకరాల్లో సెట నిర్మించారట. అన్నట్టు పెంగ్‌ జాంగ్‌ ‘ది లాస్ట్‌ సమురై’, ‘హెల్‌బాయ్‌ 2’, ‘రష్‌ అవర్‌ 3’ అనే చిత్రాలకు స్టంట్‌ మాస్టర్‌గా పనిచేశాడు. ఆ మధ్య ‘సాహో’ చిత్రబృందం ఆస్ట్రియాకు వెళ్లింది. అక్కడ ప్రభాస్, శ్రద్ధాలపై ఓ పాటను కూడా చిత్రీకరించిన సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్‌ పతాంకపై నిర్మిస్తున్న చిత్రంలో బాలీవుడ్‌కి చెందిన జాకీష్రాఫ్, నీల్‌ నితిన్‌ ముఖేష్, ఎల్విన్‌ శర్మ, మందిరా బేడీ తదితరులు నటిస్తున్నారు. జాక్వీలైన్‌ ఫెర్నాండజ్‌ ఉ ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది. నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 30, 2019 తెరపైకి రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.