96' రీమేక్‌... మారిష‌స్ టూ కెన్యా

త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన '96'ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. ఇప్పుడు షూటింగ్‌కి కూడా స‌మాయాత్తం అవుతోంది. మంగ‌ళ‌వారం నుంచి మారిష‌స్‌లో చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతోంది. మారిష‌స్‌లో రెండు రోజుల పాటు మాంటేజ్ షాట్లు తెర‌కెక్కిస్తారు. అక్కడి నుంచి చిత్ర‌బృందం కెన్యా వెళ్ల‌నుంది. శ‌ర్వానంద్‌పై కీల‌క సన్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. అక్క‌డి నుంచి టీమ్ హైద‌రాబాద్‌కి వ‌చ్చేస్తుంది. ఇక్క‌డ మ‌రో షెడ్యూల్ మొద‌లెడ‌తారు. ఈ షెడ్యూల్‌లో స‌మంత కూడా పాలు పంచుకోబోతోంది. తెలుగు కోసం ఓ మంచి టైటిల్ ని అన్వేషిస్తోంది చిత్ర‌బృందం. తెలుగు నేటివిటీకి త‌గిన‌ట్టుగా క‌థ‌లో కొన్ని మార్పులు చేశారు. అయితే అవి మ‌రీ భారీ మార్పులు కావ‌ని, అక్క‌డ‌క్క‌డ లైట్‌గా కొన్ని సీన్లు మార్చార‌ని, మాతృక‌లో ఉన్న ఫీల్ రావాలంటే సినిమాని య‌ధాత‌ధంగా తీయ‌డ‌మే మంచిద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ని తెలుస్తోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.