అతిపెద్ద రియాలిటీ షో అంటోన్న ‘ప్రేమదేశం’ హీరో అబ్బాస్‌

‘‘ఇప్పుడు దేశంలోని ప్రజలతో పాటు ప్రపంచంలోని చాలామంది ప్రజలు అతి పెద్ద రియాలిటీ  షోలో ఉన్నారని’’ అంటున్నాడు ‘ప్రేమదేశం’ హీరో అబ్బాస్‌. కరోనా వైరస్‌ (కోవిడ్‌-119) కారణంగా న్యూజిలాండ్‌లోని తన ఇంటిలో లాక్‌డౌన్‌లో ఉన్నట్టు తెలుగు, తమిళ హీరో అబ్బాస్‌ తాజాగా ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఆ వీడియోలో అబ్బాస్‌ మాట్లాడుతూ..‘‘ఇది ఇప్పటి వరకు ఎవరు నిర్వహించని అతిపెద్ద రియాలిటీ షో. ఇక్కడ ఎటువంటి డ్రామా ఉండదు. బిగ్‌బాస్, బిగ్‌ బ్రదర్‌ ఎవరూ ఉండరు. అందరూ ఎవరి ఇంట్లో వాళ్లు అతిపెద్ద రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కళ్లు ఇంట్లోనే ఉండి.. సురక్షితంగా ఉండండి అంటూ’’ చెప్పాడు. అబ్బాస్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి అలరించాడు. నితిన్, టబులతో కలిసి నటించిన ‘ప్రేమదేశం’ సినిమా అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో చాలామంది కుర్రాళ్లు అబ్బాస్‌ హెయిర్‌ స్టెయిల్, వినిత్‌ హెయిర్‌ స్టెయిల్‌తో అనుకరించారు. ప్రస్తుతం అబ్బాస్, తన భార్య ఎరుమ్‌ అలీతో కలిసి గత కొన్నాళ్లుగా న్యూజిలాండ్‌లోనే ఉంటున్నాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.