‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ అప్పుడేనా?

చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అభిమానుల కోసం చిరు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని భావిస్తుందట చిత్రబృందం. శ్రీ రామనవమి సందర్భంగా ఏప్రిల్‌ 2న ఆచార్యను చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిత్ర బృందం ఎవరి ఇంట్లో వాళ్లు ఫస్ట్‌లుక్‌ కోసం శ్రమిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే చిరు ట్విటర్‌ ఖాతా తెరిచారు. తనే స్వయంగా ఫస్ట్‌లుక్‌ను ట్విటర్‌లో పంచుకుంటారని సమాచారం. నాయికగా త్రిష ఎంపికైనా తప్పుకున్నట్లు ప్రకటించింది. ఆమె స్థానంలో కాజల్‌ నటిస్తోంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.