ఎవరంటే ఇష్టం? హీరో సూర్యకు సూటి ప్రశ్న

తమిళ కథానాయకుడు సూర్య నటిస్తున్న సినిమా ‘ఎన్‌జీకే’. సెల్వరాఘవన్‌ దర్శకుడు. ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంది. మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం విడుదల సందర్భంగా సూర్య తన అభిమానులతో కలిసి ‘ఆస్క్‌ సూర్య’ పేరుతో సోషల్‌ మీడియాలో లైవ్‌చాట్‌ నిర్వహించారు. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ లైవ్‌ షోలో సూర్యకు ఓ సర్‌ప్రైజ్‌ ఎదురైంది. భారత క్రికెట్‌ వన్డే, టి20 జట్టులో కీలక సభ్యుడు, చెన్నై సూపర్‌కింగ్స్‌ తరపున ఆడుతున్న క్రికెటర్‌ సురేష్‌ రైనా ఈ కార్యక్రమంలో లైవ్‌లోకి వచ్చారు. సూర్యని చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులో మీకిష్టమైన అటగాడు ఎవరని ఆడిగారు. దీంతో ఆశ్యర్యానికి లోనయ్యారు సూర్య. సురేష్‌ రైనా ప్రశ్నకి సమాధానం ఇస్తూ.. ‘‘నాకు చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులో ధోనీ, మీరు అంటే చాలా ఇష్టం. పాటలు పాడే మీలోని నైపుణ్యం, ధోని వేసే పెయింటింగ్‌ ్సను నేను చాలా ఇష్టపడతాను. మీకున్న బిజీ షెడ్యూల్‌లో నాతో మాట్లాడుతున్నారంటే నమ్మలేకపోతున్నాను’’అంటూ కృతజ్ఞతలు చెప్పారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.