నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి పెళ్లి?

‘మృగం’ చిత్రంతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న నటుడు ఆది పెనిశెట్టి. పేరుకు తెలుగువాడైన సరే ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్నాడు. ఆది గత కొన్నాళ్లుగా కథానాయిక నిక్కీ గల్రానీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆమెనే పెళ్లి చేసుకోనున్నాడనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీరిద్దరూ కలిసి గతంలో ‘మరకతమణి’, ‘మలుపు’లాంటి చిత్రాల్లో కలిసి పనిచేశారు. ఆ మధ్య ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడకులకు సైతం నిక్కీ హాజరై సందడి చేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఇటు ఆది కానీ నిక్కీలు స్పందిచడం లేదు. ఆది పినిశెట్టి రామ్‌చరణ్‌తో కలిసి ‘రంస్థలం’లో అతని అన్న కుమార్‌బాబు పాత్రలో నటించి అలరించారు. ప్రస్తుతం ఆది తెలుగులో నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో ‘గుడ్‌ లక్‌ సఖి’ చిత్రంలో గోలీ రాజుగా అలరించనున్నాడు. ఇందులో కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.