కామెడీ డిటెక్టివ్‌గా సంతానం?

ఏడాది తెలుగులో అత్యధికంగా థ్రిల్లర్‌ చిత్రాలు విజయవంతమయ్యాయి. అందులో హాస్యం ప్రధానంగా తెరకెక్కిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఒకటి. అనాథ శవాల చిక్కుముడుల కేసుని చేధించటానికి డిటెక్టివ్‌ ఆత్రేయ వేసే ఎత్తులు, ప్రతినాయకురాలు వేసే పైఎత్తులు, ఉత్కంఠభరితంగా సాగే కథనం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర వహించాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేసేందుకు సంతానం ఆసక్తిగా ఉన్నారని సమాచారం. హాస్య నటుడిగా సినీ ప్రస్థానం మొదలు పెట్టిన సంతానం ఇప్పుడు కథానాయకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళంతో పాటుగా హిందీలోకి కూడా తీసుకెళ్లే ఆలోచనలలో ఉన్నారట నిర్మాతలు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.