మనోజ్‌తో ప్రియాభవాని శంకర్‌?

మూడేళ్ల విరామం తర్వాత మంచు మనోజ్‌ ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శ్రీకాంత్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. నిర్మల దేవి, మనోజ్‌ నిర్మాతలు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బుల్లితెర వ్యాఖ్యాత, నటి ప్రియాభవాని శంకర్‌ నటిస్తుందని తాజా సమాచారం. తమిళ ఛానళ్లలో పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన భవాని వెండితెరపైనా కాలుమోపింది. పలు తమిళ చిత్రాల్లో నటించి అలరించింది. ‘అహం బ్రహ్మాస్మి’ కథకు ఈ నాయికే న్యాయం చేయగులుగుతుందని భావిస్తుందట చిత్రబృందం. ఇలాంటి స్క్రిప్ట్‌కు పరిచయం లేని నటి అయితేనే బావుంటుందని అనుకుంటున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం కమల్‌ హాసన్‌తో దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’లో ఓ కీలక పాత్ర పోషిస్తుందీ భామ.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.