నాటి తెలుగు కథానాయకుడు రాజేష్ తనయ ఐశ్వర్య రాజేష్. తొలుత తమిళంలో నటించిన ఈ అమ్మడు ఆ తరువాత తెలుగులో అడుగుపెట్టింది. `కౌసల్యా కృష్ణమూర్తి`, `వరల్డ్ ఫేమస్ లవర్`లాంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. తాజాగా ‘డ్రైవర్ జమున’ అనే చిత్రంతో మనముందుకు రాబోతుంది. చిత్రానికి గిన్స్ లిన్ దర్శకత్వం వహిస్తున్నారు. కథేంటంటే ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి కాల్ టాక్సీ డ్రైవర్ కావడానికి ఆమె పడిన కష్టాలు, అనుభవాలనే ప్రధాన అంశంగా తీసుకొని చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంగా వస్తోన్న చిత్రానికి జిబ్రాన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. 18 రీల్స్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య - నాని కథానాయకుడిగా నటిస్తోన్న ‘టక్ జగదీష్’ చిత్రంలో చేస్తుంది.