అఖిల్‌తో సినిమా తీయనున్న నితిన్‌?

అక్కినేని యువహీరో అఖిల్‌ కథానాయకుడిగా ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే తాజాగా ఆయన ప్రముఖ కథానాయకుడు నితిన్‌ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు తెలుగుచిత్రసీమలో వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘అతనొక్కడే’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలను తెరకెక్కించిన సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్నారట. ఈ ఏడాది ద్వీతియార్థంలో చిత్రం సెట్స్‌పైకి వెü™్ల అవకాశం ఉందట. అయితే అధికారింగా ఈ సమాచారం ఎక్కడా బయటకు రాలేదు. ప్రస్తుతం అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో కథానాయికగా పూజాహెగ్డే నటిస్తుంది. బొమ్మరిల్లు బాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.